Posts

ప్రేమాహ్వానం

Image
 ప్రపంచంలో వెలిగే ఈ దీపాలవెలుగులో నీ రాకతో నా హృదయాంధకారాలలో ఓ ప్రేమదీపం వెలిగించావు రాధ (Img src=https://images.fineartamerica.com) ప్రపంచాన్ని చుడాలని పరితపించే నా కనులు నిన్ను చూడగానే నివ్వే నా ప్రపంచమన్నట్లు కనురెప్ప వాల్చడంలేదు. వికసించిన కమలంలా పవిత్రమైనది నీ మనసు.... నవ్వుతున్న పాపాయిల నిర్మలమైనది నీ నవ్వు..... కనిపించనివి కూడ వినిపించే కవినేయైన నువ్వు కనిపించగానే  నా కలం మూగపోయింది రాధ ప్రేమకు ప్రతిరూపమైన రాధ ప్రేమ వ్యతిరేకైనా నేను నీ ప్రేమను కోరుకుంటూ నీకై నిరీక్షిస్తూ....... నీ కృష్ణ

S6 children's wishes for the best person

Image
చంద్రునిలా అయన కురిపించే ప్రేమవెన్నెలకు  అమావాస్య అడ్డుకావచ్చు కానీ సూర్యునిలా అయన అందించే విజ్ఞానవెలుగులకు అంతంలేదు అటువంటి మా Santhosh kumar sir  గారికి "పుట్టినరోజు శుభాకాంక్షలు" S6 children's wishes for the best person వికసించిన కలువలా ,     చిరుగాలికి చిన్నోడి నవ్వులా                    నవ్వుతూ  class లోకి వస్తారు తన కిరణాలతో సూర్యుడు ప్రొద్దుతిరుగుడు పూలను తనవైపు తిప్పుకున్నట్టుగా మీ మాటలతో అందరిని మీవైపు ఆకర్షించుకొని class start చేస్తారు సూర్యుని వేడికి వాలిన ప్రొద్దుతిరుగుడు పూలకు నీలిమేఘం అడ్డొచ్చి ఊరటనిచ్చినట్టుగా అలసిన మాకు  tv remote  stories చెపుతూ మమ్మల్ని class వినేలాచేస్తారు చల్లనిగాలికి ఊగుతున్న పచ్చనిచెట్టుపై  పిడుగుపడ్డట్టుగా suddenగా board పై question చెయ్యమని కొందరిని బెదిరకొడతారు పువ్వునుండి తేనెనను తీసే తుమ్మెదలా ,మా ప్రతిభను వెలికితీస్తారు వికెట్లు తీయడంలో వీరుడు , ప్రేమను పంచడంలో చంద్రుడు గురువులా విద్యను అందిస్తారు తండ్రిలా మందలిస్తారు తల్లిలా ప్రోత్సహిస్తారు స్నేహితుడిలా సంతోషాలను పంచుకుంటారు Java తో పరిచ

అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు

Image
ఉద్దేశం :                                               అమ్మ ప్రేమను మాటల్లో తెలపడం అసాధ్యం , ఆమె ప్రేమకు హద్దులు ,అవధులు ఉండవు. అలాంటి  ఓ అమ్మ కథనే ఈ కవిత.  చిన్నప్పటినుండి తన కొడుకును ఎంతో ప్రేమానురాగాలతో పెంచింది ఓ అమ్మ . తన కొడుకుకు పెళ్ళి చేసింది, వారితో సంతోషంగా  జీవించాలని ఆశపడింది . ఆ తరువాత ఏ మాత్రం మానవతావిలువలు లేని తన కొడుకు చేతిలోనే కన్నుమూశారు. చనిపోయిన ఆమె ఆత్మగోషనే నా ఈ కవిత .              అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు (img sourge="KGF movie") నిద్రకు  నూరేళ్లు       నా చిట్టి తండ్రికి వెయ్యేళ్ళు అంటూ             జోల పాటలెన్నో పాడాను                   నిన్ను చూసి నేను మురిసాను. కొండల్లో  వున్నోల్లో నీ మామలు      కొండ బూచోళ్లు అంటూ            గోరుముద్దలెన్నో  తినిపించాను                  గుండెళ్ళో  నిన్ను దాచుకున్నాను . అష్టకష్టాలు నేను పడుతూ             అన్ని పనులు  చేసిపెడుతూ (img source="Kanaa Movie") కడుపు  మాడ్చుకుని                నీ కడుపు నింపాను. కాళ్ళు ,చేతులు  కలుముకున్న         కాయా ,కష్టం నేను చేస్తూ నీ పాదాలు కందనివ్వకుండా

మహిళ గొప్పదనం

Image
 ఉద్దేశ్యం :-  మహిళాదినోత్సవం  సందర్బంగా మహిళల గొప్పదనాన్ని  మరోసారి తెలియజేసే ఓ చిన్న  ప్రయత్నమే ఈ కవిత .                                    మహిళ గొప్పదనం (img src:thecareermuse.co.in) భూమి చుట్టూ చంద్రునిలా        మన చుట్టూ తిరుగుతూ            కంటిపై రెప్పలా కాపాడే అమ్మ ఓ మహిళవిశ్వం అంత ప్రేమను        చిన్న రాఖీతో తెలిపే అక్క ఓ మహిళ పసిపిల్లలనే పంట పొలాలపై        వర్షంలా వర్షించే వారు మహిళలు హరివిల్లులా కనిపించేవారు మహిళలు ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరిగినట్లు        కుటుంబ శ్రేయస్సు కోసం కృషిచేసేవారు             సమాజ సమృద్ధికి తోడ్పడే వారు మహిళలు!! పువ్వులకు పరిమళం ఎక్కువ         మగువకు సహనం ఎక్కువ ప్రకృతికి నిదర్శనం పచ్చదనం         కుటుంబ వృద్ధికి మహిళ నవ్వే చిహ్నం . ఆకాశ వీధుల్లో నిన్ను ఆకర్షించే          తారలను చూస్తున్నావ్ కానీ కారుమేఘాల మధ్య కనుమరుగవుతున్న        కాంతిమణులను కాంచాలేవా సూర్యబింబం అనే బొట్టును నుదుట దాల్చినవారు మహిళలు ప్రపంచంవైపు అడుగులు వేయించే         మొదటి గురువు అమ్మ ఓ మహిళ అనురాగ ,ఆప్యాయతలకు నిదర్శనమైన సోదరి ఓ మహిళ ప్రేమకు నిదర్శనమైన ప

ఆత్మధైర్యం

Image
ఉద్దేశం :    జీవితంలో  ఎదురైయ్యే కొన్ని  సంఘటనలు  మన హృదయాలను  కంపింపచేస్తాయి . అలాంటి  సమయంలో  మనసు నిరాశ ,నిస్పృహలకు  లోనవుతుంది .  అటువంటి సమయంలో వారికీ  గఢాంధకారం  కమ్ముకున్న   ,  వెలుగును వెతుక్కోవచ్చని తెలిపి , వారిని   తిరిగి వారి గమ్యాలవైపు  అడుగులు  వేసేలా  ప్రేరేపించడమే  ఈ  కవిత  యొక్క ముఖ్య  ఉద్దేశం .                                           ఆత్మధైర్యం (img src ="commons.wikimedia.org") ఆశలన్నీ  ఆకులై రాలిపోయి  నింగికెగసినా యత్నాలన్నవి  ఆపబోకు ఆత్మధైర్యం  వదులుకోకు . వర్షపుచినుకు  తాకిడితోనే ఏ  చెటైన  చిగురించెను భానుడివలె  ప్రకాశించెను పూలుపళ్ళతో  విల్లివిసిరేను వృక్షాలన్నింటిలో  శోభిల్లేనని  మర్చిపోకు . నీ  జననానికి  మునుపే మొదలైంది  నీ  జీవితమనే  యుద్ధం కనిపించని  కత్తులతో  , కసరత్తులతో అంతం  తెలియకుండానే  ఆరంభమైంది  ఈ  యుద్ధం ఎన్నో  సంఘర్షణల  సంగమమే  నీ  జీవితం . సుఖం  పొందాలనుకునేవారు  ఎన్నో  సంఘర్షణలను  ఎదుర్కొంటారు . సంతోషం  పొందాలనుకునేవారు  శాంతిని  పొందుతారు . కానీ  తనచుట్టు  ఉన్న వారికీ సంతోషాన్ని అందించాలనుకునేవారు  కాలం  పన్నే వ్యూహాల

ఆవేదన

Image
              అల్లారుముద్దుగా  పెరిగిన  అమ్మాయి  అమ్మానాన్నల  మాటకు  విరుద్దంగా  ప్రేమించిన  అబ్బాయిని  పెళ్లిచేసుకుంది . ఆ  తరువాత  తాను  ఎదుర్కొంటున్న  సమస్యలను  , ఆమె వేదనను తెలపడమే ఈ కవిత  .                                             ఆవేదన  (img src="pixabay.com") చుక్కలన్నీ నేలరాలిన దిక్కులన్నీ  స్థితులు తప్పిన నిన్ను వీడని  నీడలాగా        నీ  వెంటుంటానన్న  మాటలకే పరవసించి  బంగారు  భవితని  భావించాను బంధాలను  ఎదిరించి  భరోసాతో  ముందడుగేసాను (img src="img.clipartxtras.com") అపురూపమైన అమ్మ ప్రేమను అవదులులేని  నాన్న అనురాగంను అమితమైన  అక్కతమ్ముల ఆప్యాయతను బుడిబుడి  అడుగుల బంధం చిరుమందహాస  బృందాలను అనుక్షణం  నా  కోసం ప్రతిక్షణం  నా  బాగుకోరుకునేవారి బంధాలను  త్యదించి  వచ్చా  కానీ ఇప్పుడు  నా చంపలపై  కన్నీరు తుడిచేవారే  కరువయ్యారు . నింగినున్న  నీలిమేఘమని              కారుమేఘపు  కౌగిల్లో  చిక్కి కన్నీలెన్నో  కురిపించాను              కనుమరుగైపోతున్నాను ఏ  మంత  నేరం చేశాను  నేను               నీ  భవితకే  పోశాను