ఆత్మధైర్యం

ఉద్దేశం :

   జీవితంలో  ఎదురైయ్యే కొన్ని  సంఘటనలు  మన హృదయాలను  కంపింపచేస్తాయి . అలాంటి  సమయంలో  మనసు నిరాశ ,నిస్పృహలకు  లోనవుతుంది .  అటువంటి సమయంలో వారికీ  గఢాంధకారం  కమ్ముకున్న   ,  వెలుగును వెతుక్కోవచ్చని తెలిపి , వారిని   తిరిగి వారి గమ్యాలవైపు  అడుగులు  వేసేలా  ప్రేరేపించడమే  ఈ  కవిత  యొక్క ముఖ్య  ఉద్దేశం . 

                                         ఆత్మధైర్యం

(img src ="commons.wikimedia.org")

ఆశలన్నీ  ఆకులై
రాలిపోయి  నింగికెగసినా
యత్నాలన్నవి  ఆపబోకు
ఆత్మధైర్యం  వదులుకోకు .

వర్షపుచినుకు  తాకిడితోనే
ఏ  చెటైన  చిగురించెను
భానుడివలె  ప్రకాశించెను
పూలుపళ్ళతో  విల్లివిసిరేను
వృక్షాలన్నింటిలో  శోభిల్లేనని  మర్చిపోకు .

నీ  జననానికి  మునుపే
మొదలైంది  నీ  జీవితమనే  యుద్ధం
కనిపించని  కత్తులతో  , కసరత్తులతో
అంతం  తెలియకుండానే  ఆరంభమైంది  ఈ  యుద్ధం
ఎన్నో  సంఘర్షణల  సంగమమే  నీ  జీవితం .

సుఖం  పొందాలనుకునేవారు  ఎన్నో  సంఘర్షణలను  ఎదుర్కొంటారు .
సంతోషం  పొందాలనుకునేవారు  శాంతిని  పొందుతారు .
కానీ  తనచుట్టు  ఉన్న వారికీ సంతోషాన్ని
అందించాలనుకునేవారు  కాలం  పన్నే వ్యూహాలతో
ఎన్నో  సంఘర్షణలతో  పోరాడాల్సివస్తుంది .
పోరడు పోరాడితే గెలిచేది  నువ్వే
రేపన్నది  నిలిచేది నువ్వేనని  మర్చిపోకు .

భగవంతుడు  ఆడే  ఈ  ఆటలో
కాలమనే  ప్రత్యర్థిని  ఎదుర్కోడానికి
(img src = " thriveglobal.com ")

ఆయన  ప్రశించిన ఆయుధమే  చదువని తెలుసుకో .

నీ  వివేకమనే  దీపంతో
నీ  వారి అంధకారపు  జీవితంలో  వెలుగు  నింపు .

ఆకాశంలోని తారల్లా  ఉండాలని  ప్రయత్నించకు
నీ  పక్కవారి  హృదయంలో  స్థానానికై  ప్రయత్నించు
ఆ  స్థానాలే  నిన్ను  ఆకాశంలో చల్లని  చంద్రునిలా  మారుస్తాయని  తెలుసుకో .

కారుమేఘలు  కమ్ముకున్నంతమాత్రాన
సూర్యుని  వెలుగును  ఆపలేవని  తెలుసుకో .

ఏ  విధంగా  నది  తనమార్గంలోని  మేరుపర్వతాలను సైతం  పెకలించి  వేస్తుందో
ఆ విధంగా  నువ్వు నీ  సమస్యలను  మటుమాయం  చేయాలి .
గఢాంధకారంలో  చిక్కుకున్న  ,  వెలుగును వెతుక్కోవచ్చని  మర్చిపోకు .

నదికి  తన ప్రవాహమే  తన  గుర్తింపు
సూర్యునికి  తన  ప్రకాశమే  తన  గుర్తింపు
పువ్వులకు  తమ  పరిమళమే  తమ  గుర్తింపు

నీకు  నీ జ్ఞానమే  నీ  గుర్తింపని  మర్చిపోకు .

వజ్రాన్ని చేజార్చుకున్నానని  దిగులుచెందకు
అంతకుమించి  విలువైన ముత్యాన్ని  పొందుతానని సంతోషించు .

నీ  అపజయాన్ని  చూసి  కంటతడి పెట్టుకోకు
అపజయానికి  మూలమైన  ములార్దాన్ని తెలుసుకోవడమే  నీ  పరమార్థం .
అది నేర్పిన  పాఠంతో  ముందడుగు వేయడమే
 నీ  కర్తవ్యమని  తెలుసుకో  మిత్రమా !  

 

 

భావం :
చెట్టు  తన  ఆకులన్నీ రాలి పోయి ఆకాశమంత  అయిన అది మళ్ళి  చిగురిస్తుంది  అదే విధంగానే  నువ్వు  కూడా నీ  కోరికలు , ఆశయాలకు  అపజయాలు  ఎదురైనా  మళ్ళి  ప్రయత్నించాలి ,ఆత్మధైర్యంతో  ముందడుగు  వేయాలి .
       వర్షపు  జల్లల తాకగానే  ఆకులు రాలి అందవికారంగా  ఉన్న చెట్టు  అందంగా  వికసిస్తుంది , సూర్యుని  కాంతిలో  అద్భుతంగా  వెలిగిపోతుంది ,మంచి  సువాసన  ఇచ్చే  పూలతో  , రుచికరమైన  పళ్ళతో  రూపుదాచుకుంటుంది . పచ్చని  చెట్ల  మధ్య  కల్పవృక్షంలా  సంతరించుకుంటుంది .  ఆ విధంగానే  వర్షం  చినుకుల మనిషికి ఆత్మధైర్యం  తోడైతే  మనిషి  తన వివేకంతో  వెలుగుతాడు , మంచి  విజయాలను  పొందుతాడు . తన గుణగణాలతో  సమాజంలో ఓ  ప్రతిష్టాత్మక  స్థానమును  పొంది  వెలుగుతావని   మర్చిపోకు .
నువ్వు  జన్మించాక  ముందే  అమ్మ కడుపులోనే  ప్రారంభమైంది  నీ  జీవితమనే  యుద్ధం . అది కంటికి కనిపించని  కత్తులతో  జరిగే  యుద్ధం .  ముగుంపు  తెలియకుండా  మొదలైంది  ఈ  యుద్ధం  ,  ఎన్నెన్నో  సంఘర్షణల  కలయికే  నీ  జీవితమని  తెలుసుకో .

సుఖం  పొందాలనుకునేవారు  ఎన్నో కష్టాలను  ఎదుర్కోవాల్సి  వస్తుంది . సంతోషం  పొందాలనుకునేవారు  ప్రతి  క్షణం  శాంతిని  పొందుతారు . కానీ నీ  కుటుంబం  సుఖం అందించాలనుకునే  నీ  లాంటివారు  కాలం  కలిగించే  కష్టాలతో,ఎన్నో  సంఘర్షణలతో   పోరాడాల్సివస్తుంది . పోరడు పోరాడితే గెలిచేది  నువ్వే  ,రేపన్నది  నిలిచేది నువ్వేనని  మర్చిపోకు .
భగవంతుడు  ఆడుతున్న  ఈ  ఆటలో కాలమనే  ప్రత్యర్థిని  ఎదుర్కోడానికి అయన ప్రసాదించిన  ఆయుధమే  చదువని తెలుసుకో.
చీకటిలో  దీపం  వెలుగును పంచినట్లు  నువ్వు  నీ అమోఘమైన  నీ  ప్రతిభతో  నీ  కుటుంబంను  సంతోషాలవైపు  నడిపించు .
  
ఆకాశంలో  నక్షత్రంలా  ఉండాలని  అనుకోకు  , నీ  చుట్టునున్న  వారి  మనసులో  స్థానమును  సంపాదించుకో  ఆ  స్థానమే  నిన్ను  ఆకాశంలో చల్లని  చంద్రునిలా  మారుస్తాయని  తెలుసుకో
నల్లని  మేఘాలు ఎంత  కమ్ముకున్న  సూర్యుని  వెలుగును  ఆపలేవు  ఆ విధంగానే  నీ  ప్రతిభను  ఎవ్వరికి  సాటిరాదని  తెలుసుకో

ఏ  విధంగా  నది  తనమార్గంలోని  అడ్డొచ్చిన  మేరుపర్వతాలను సైతం  పెకలించి  ప్రవహిస్తుందో ,ఆ విధంగా  నువ్వు నీ  సమస్యలను  దూరం  చేసుకోవాలి .  గఢాంధకారం కమ్ముకున్న   వెలుగును  వెతుక్కోవచ్చు ., అలాగే  ఎంత పెద్ద సమస్యలు  ఎదురైనా  పరిష్కారాలను  కనుగొనవచ్చని  మర్చిపోకు .

ఏ విధంగా నదికి  తన ప్రవాహంలోని  వేగమే  తన  గుర్తింపు ,సూర్యునికి  తన  వెలుగే   తన  గుర్తింపు , పువ్వులకు  తమ  పరిమళమే  తమ  గుర్తింపు , ఆ విధంగానే  నీకు  నీ జ్ఞానమే  నీ  గుర్తింపని  మర్చిపోకు .

మన  జీవితంలో  ఓ విలువైన  ఏదైనా  దూరమైతే  , అంతకు  రెండింతల  విలువైనది  పొందుతావని  తెలుసుకో .

నీకు ఎదురైన  అపజయాన్ని  చూసి  కంటతడి పెట్టుకోకు , అందుకు  కారమైన  వాటిని  తెలుసుకో , ఈ  అపజయం  నేర్పిన  పాఠంతో  ముందడుగు వేయడమే  నీ  కర్తవ్యమని  తెలుసుకో  మిత్రమా ! 

 

Comments

  1. REALLY VERY INSPIRATIONAL POEM
    I LIKE THIS VERY MUCH
    KEEP MOOVING
    ALL THE BEST

    ReplyDelete
  2. nice and thats true.we keep listening these words in our life.so every one donot neglect these words.
    kindly keep in your mind.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

friendship day

Education