Posts

Showing posts from January, 2019

ఆత్మధైర్యం

Image
ఉద్దేశం :    జీవితంలో  ఎదురైయ్యే కొన్ని  సంఘటనలు  మన హృదయాలను  కంపింపచేస్తాయి . అలాంటి  సమయంలో  మనసు నిరాశ ,నిస్పృహలకు  లోనవుతుంది .  అటువంటి సమయంలో వారికీ  గఢాంధకారం  కమ్ముకున్న   ,  వెలుగును వెతుక్కోవచ్చని తెలిపి , వారిని   తిరిగి వారి గమ్యాలవైపు  అడుగులు  వేసేలా  ప్రేరేపించడమే  ఈ  కవిత  యొక్క ముఖ్య  ఉద్దేశం .                                           ఆత్మధైర్యం (img src ="commons.wikimedia.org") ఆశలన్నీ  ఆకులై రాలిపోయి  నింగికెగసినా యత్నాలన్నవి  ఆపబోకు ఆత్మధైర్యం  వదులుకోకు . వర్షపుచినుకు  తాకిడితోనే ఏ  చెటైన  చిగురించెను భానుడివలె  ప్రకాశించెను పూలుపళ్ళతో  విల్లివిసిరేను వృక్షాలన్నింటిలో  శోభిల్లేనని  మర్చిపోకు . నీ  జననానికి  మునుపే మొదలైంది  నీ  జీవితమనే  యుద్ధం కనిపించని  కత్తులతో  , కసరత్తులతో అంతం  తెలియకుండానే  ఆరంభమైంది  ఈ  యుద్ధం ఎన్నో  సంఘర్షణల  సంగమమే  నీ  జీవితం . సుఖం  పొందాలనుకునేవారు  ఎన్నో  సంఘర్షణలను  ఎదుర్కొంటారు . సంతోషం  పొందాలనుకునేవారు  శాంతిని  పొందుతారు . కానీ  తనచుట్టు  ఉన్న వారికీ సంతోషాన్ని అందించాలనుకునేవారు  కాలం  పన్నే వ్యూహాల