S6 children's wishes for the best person

చంద్రునిలా అయన కురిపించే ప్రేమవెన్నెలకు  అమావాస్య అడ్డుకావచ్చు కానీ సూర్యునిలా అయన అందించే విజ్ఞానవెలుగులకు అంతంలేదు అటువంటి మా Santhosh kumar sir  గారికి "పుట్టినరోజు శుభాకాంక్షలు"

S6 children's wishes for the best person


వికసించిన కలువలా ,
    చిరుగాలికి చిన్నోడి నవ్వులా      
             నవ్వుతూ  class లోకి వస్తారు

తన కిరణాలతో సూర్యుడు ప్రొద్దుతిరుగుడు పూలను తనవైపు తిప్పుకున్నట్టుగా

మీ మాటలతో అందరిని మీవైపు ఆకర్షించుకొని class start చేస్తారు


సూర్యుని వేడికి వాలిన ప్రొద్దుతిరుగుడు పూలకు నీలిమేఘం అడ్డొచ్చి ఊరటనిచ్చినట్టుగా

అలసిన మాకు  tv remote  stories చెపుతూ మమ్మల్ని class వినేలాచేస్తారు


చల్లనిగాలికి ఊగుతున్న పచ్చనిచెట్టుపై  పిడుగుపడ్డట్టుగా

suddenగా board పై question చెయ్యమని కొందరిని బెదిరకొడతారు


పువ్వునుండి తేనెనను తీసే తుమ్మెదలా ,మా ప్రతిభను వెలికితీస్తారు

వికెట్లు తీయడంలో వీరుడు , ప్రేమను పంచడంలో చంద్రుడు

గురువులా విద్యను అందిస్తారు

తండ్రిలా మందలిస్తారు

తల్లిలా ప్రోత్సహిస్తారు

స్నేహితుడిలా సంతోషాలను పంచుకుంటారు

Java తో పరిచయమైన జాబిలి మీరు

Computer Network తో పెరిగిన తారల Network మనది

మనమందరం కలిస్తేనే అందమైన S06 అనే ఆకాశం



Javaలా Simpleగ ఉండే మీరు

Javaలగే ఎల్లపుడు Robustగ ఉండాలని ఈశ్వరుని  ప్రార్థిస్తూ

S06 అందరి తరుపున "పుట్టినరోజు శుభాకాంక్షలు " మాస్టారు .


                   
                                                                                  --తలారి ధనుంజయ







Comments

Popular posts from this blog

friendship day

ఆవేదన

Happy Raksha Bandhan