మహిళ గొప్పదనం

 ఉద్దేశ్యం :-
 మహిళాదినోత్సవం  సందర్బంగా మహిళల గొప్పదనాన్ని  మరోసారి తెలియజేసే ఓ చిన్న  ప్రయత్నమే ఈ కవిత .
                                   మహిళ గొప్పదనం

(img src:thecareermuse.co.in)
భూమి చుట్టూ చంద్రునిలా
       మన చుట్టూ తిరుగుతూ
           కంటిపై రెప్పలా కాపాడే అమ్మ ఓ మహిళవిశ్వం అంత ప్రేమను
       చిన్న రాఖీతో తెలిపే అక్క ఓ మహిళ
పసిపిల్లలనే పంట పొలాలపై
       వర్షంలా వర్షించే వారు మహిళలు
హరివిల్లులా కనిపించేవారు మహిళలు
ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరిగినట్లు
       కుటుంబ శ్రేయస్సు కోసం కృషిచేసేవారు
            సమాజ సమృద్ధికి తోడ్పడే వారు మహిళలు!!
పువ్వులకు పరిమళం ఎక్కువ
        మగువకు సహనం ఎక్కువ
ప్రకృతికి నిదర్శనం పచ్చదనం
        కుటుంబ వృద్ధికి మహిళ నవ్వే చిహ్నం .
ఆకాశ వీధుల్లో నిన్ను ఆకర్షించే 
        తారలను చూస్తున్నావ్ కానీ
కారుమేఘాల మధ్య కనుమరుగవుతున్న
       కాంతిమణులను కాంచాలేవా
సూర్యబింబం అనే బొట్టును నుదుట దాల్చినవారు మహిళలు
ప్రపంచంవైపు అడుగులు వేయించే
        మొదటి గురువు అమ్మ ఓ మహిళ
అనురాగ ,ఆప్యాయతలకు నిదర్శనమైన సోదరి ఓ మహిళ

ప్రేమకు నిదర్శనమైన ప్రేయసి ఓ మహిళ
మహిళలందరికీ నిలయం
        మనందరి నివాసమైన భూమి ఓ మహిళ
మహిన మహిళలను గుర్తిద్దాం
వారికి పూర్తి స్వేచ్ఛను అందిద్దాం
బంగారు భవిష్యత్తుకు
బాటలు వేయడానికి తోడ్పడుదాం
మనసున్న మనుషులుగా ముందుకు నడుద్దాం




Comments

  1. పువ్వులకు పరిమళం ఎక్కువ
    మగువకు సహనం ఎక్కువ
    what a line..Super..
    Very Nice...
    All The Best...

    ReplyDelete
  2. Your poetry is so powerful that you put into words exactly what a women's life is in just a small poem. Keep it up.

    ReplyDelete
  3. Awesome lines...,excellent poetry

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

friendship day

ఆవేదన

Happy Raksha Bandhan