అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు

ఉద్దేశం :
                      
                       అమ్మ ప్రేమను మాటల్లో తెలపడం అసాధ్యం , ఆమె ప్రేమకు హద్దులు ,అవధులు ఉండవు. అలాంటి  ఓ అమ్మ కథనే ఈ కవిత.  చిన్నప్పటినుండి తన కొడుకును ఎంతో ప్రేమానురాగాలతో పెంచింది ఓ అమ్మ . తన కొడుకుకు పెళ్ళి చేసింది, వారితో సంతోషంగా  జీవించాలని ఆశపడింది . ఆ తరువాత ఏ మాత్రం మానవతావిలువలు లేని తన కొడుకు చేతిలోనే కన్నుమూశారు. చనిపోయిన ఆమె ఆత్మగోషనే నా ఈ కవిత .

            అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు

(img sourge="KGF movie")
నిద్రకు  నూరేళ్లు
      నా చిట్టి తండ్రికి వెయ్యేళ్ళు అంటూ
            జోల పాటలెన్నో పాడాను
                  నిన్ను చూసి నేను మురిసాను.
కొండల్లో  వున్నోల్లో నీ మామలు
     కొండ బూచోళ్లు అంటూ
           గోరుముద్దలెన్నో  తినిపించాను
                 గుండెళ్ళో  నిన్ను దాచుకున్నాను .
అష్టకష్టాలు నేను పడుతూ
            అన్ని పనులు  చేసిపెడుతూ
(img source="Kanaa Movie")
కడుపు  మాడ్చుకుని
               నీ కడుపు నింపాను.
కాళ్ళు ,చేతులు  కలుముకున్న
        కాయా ,కష్టం నేను చేస్తూ నీ పాదాలు కందనివ్వకుండా
        నా కనుసన్నల్లో నిన్ను పెంచాను.
కరుణలేని కాలంతో పోరాడుతూ
       కన్నీటి  అలలు  పొంగుతున్నా
            నీ నవ్వుల  జల్లుల్లో  పరవసించాను .
ఎదుగుతున్న నిన్ను
    పొగుడుతున్నవారిని చూసి
       ఎంతగానో  పొంగిపొయాను .
పచ్చని  పంటలా నీ జీవితం  వుండాలని
       పచ్చతోరణాల  మద్య  పెళ్ళి చేసినదాన్ని .
పున్నమి  వెంటనే అమవాస్య అన్నట్లు
       అమ్మ అల్లమాయె ,ఆస్తి బెల్లమయే నీకు.
ఉడ్చిపారేసిన పొరకలాగా
         ఓ మూలాన నన్ను ఉంచావు నువ్వు .
తేనే  ఉన్న  పువ్వు  దగ్గరికి  తుమ్మెద వెళ్లినట్లు
      ప్రేమ పంచె కూతురి దగ్గరకు
         నేను  వెలితే ఆస్తిపోతుందేమోనని,
             అందరిలో నన్ను  చెప్పుతో కొట్టావు నువ్వు   .
గోరుముద్దలు  పెట్టిన చేయి
       ఆకలన్న పట్టించుకోలేదు నువ్వు
నా మాటలు నీ భవితకు బాటలన్నావు
      ఇప్పుడు  ఆ భవితలోనే నన్ను చెరిపేసావు.
కమ్ముకున్న  చీకట్లో సూర్యుడిలా
       నా కష్టాల మధ్య ఉదయించావు నువ్వు ,
నీ నవ్వుల వెలుగులో ప్రపంచాన్ని చూసా
       కానీ నువ్వు ఆ చికట్లలోనే ఉన్నావని తెలుసుకోలేకపోయాను.
నీలో అడుగంటిన మనవతావిలువలకు
            నిదర్శనమే నా ఈ చావు .
మానవతావిలువలను నీ పిల్లలకు నేర్పుకో,
                నీ భవితను కాపాడుకో.
  



Comments

Post a Comment

Popular posts from this blog

friendship day

ఆవేదన