friendship day
Every one need to know about this. From this poem you can find real meaning of friend according to my opinion i.e.who
stay with us at every movement, who likes us always , who understand us
at every situation, who saves us from problems and who makes us to be
happy. I hope you like it.
తళతళ మెరిసే తరాల మధ్య చంద్రునిలా ఉన్నపుడును
భూమి మీద కొలనులో ఏక్షణం చెదిరిపోతాడో తెలియని చంద్రునిలా ఉన్నపుడును
మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడు
అందాలొలికే జలపాతం నీరులా ఉన్నపుడు ఇష్టపడేవారు కొందరు
ప్రశాంతంగా ప్రవహించే నదులను చూసి ఇష్టపడేవారు మరికొందరు
ఎదిగిన ఒదగాలన్నట్లు ఎగిసిపడే అలలను చూసి ఇష్టపడేవారు ఇంకొందరు
కానీ మనల్ని మనలా ఇష్టపడేవారు నిజమైన మిత్రుడు
అగ్నిపర్వతంలా పేలిన ,
హిమానీనదంలా విజృభించిన ,
మేరుపర్వతంలా కుంగిపోయినా
ఎల్లపుడు మనల్ని అర్థంచేసుకొనేవారే నిజమైన మిత్రుడు
బుడి బుడి అడుగులు నేర్పిన నాన్నలా ,
తప్పటడుగులు సరిదిద్దేవాడు
సాలెపురుగు గుళ్ళనుంచి తప్పించేవారు
అమ్మలా అనంతమైన ప్రేమను అందించేవారు
బాధల్లో ఉన్నపుడు భరోసానిచ్చేవారు
నాన్నలా అలరిస్తూ , అమ్మలా ప్రేమిస్తూ
అన్నలా ఏడిపిస్తూ , అక్కలా ఆప్యాయతను చూపుతూ
తమ్ముడుచెల్లెలులా ప్రశంసిస్తూ , గురువులా బోధిస్తూ
మన అడుగులతో కలిసి నడిచే బహుముఖప్రజ్ఞావంతులు .
పున్నమి చంద్రుని చూస్తూ ,
జాలువారే వెన్నెలను అనుభవిస్తున్న చకోరపక్షుల ముఖంలా
సెలవుల ముందు ,పిల్లల కిలకిలారావల్ల
వర్షంపు చిరుగాలికి ,నవ్వుతున్న పసిపిల్లాడి ముఖంలా
మనల్ని మార్చేవారు
ఎప్పుడు గుర్తుతెచ్చుకున్నాకూడా
కమనీయ కన్నుల కనుపాప మీద ,
మరపురాని తీపిగుర్తులు కదులుతూ మన చిరుమందహాస వికాసానికి తోడ్పడేవారు .
వర్షం పడినవేళ , వచ్చే మట్టి సువాసనలా
అపుడే పుట్టిన అందమైన సీతాకోకచిలుకలా
పౌర్ణమినాటి వెన్నెలకు వికసించిన
కమనీయ కలువలంత పవిత్రకు నిదర్శనంగా ఉండాలి ఈ స్నేహం .
కనుమరుగైన ఆ దైవం
కష్టాలను చెప్పుకోవడానికి,
కాంతిమార్గంలో నడిపించడానికి పంపిన
వరమే స్నేహం అనే బంధం అనుకుంటూ
నా రంగుల ప్రపంచంలో
నిండునూరేళ్ళు ఈ స్నేహం ఉండాలని కోరుకుంటూ
HAPPY FRIENDSHIP DAY
---- తలారి ధనుంజయ
(img src:- https://http://theteenagertoday.com) |

మిత్రులందరికీ "HAPPY FRIENDSHIP DAY"
Comments
Post a Comment