Happy Raksha Bandhan

This poem is all about "How,A sister take cares her brother  and How brother will feel when he get rakhi from his sister". I hope you like it.

Happy Raksha Bandhan

                                                    ---తలారి  ధనుంజయ

విశ్వమంత ప్రేమను 
            ఆకాశమంత  అనురాగంను
సముద్రమంత  ఆప్యాయతను
           ఓ చిన్ని రాఖీతో  తెలుపుతుంది  నువ్వు.            https://si.wsj.net/public/resources/images/BN-PL552_indfes_J_20160818044621.jpg
అమ్మలా  అనురాగంను
            నాన్నలా  ఆప్యాయతను  అందిస్తూ
ఆకాశపు  అంచుల్ని  తాకేలా
            స్ఫూర్తిని ఇచ్చేది నువ్వు .
ఎడారి మొక్కల ఉన్నపుడు
            వర్షంలా  మారి  ఆనందాన్ని
                        కురిపించేది  నువ్వు .
బుడిబుడి అడుగులు వేసే పాపాయికి
             అమ్మలా  సహాయ పడుతుంది నువ్వు
అమ్మ చుక్కల్లో  చంద్రున్ని  చూపిస్తూ
             తన గోరుముద్దలు తినిపిస్తుంది
నువ్వు చుక్కల్లో  చంద్రునిలా  కావాలని తన
             స్ఫూర్తితో  కూడిన ప్రేమముద్దలను తినిపిస్తుంది  నువ్వు
బాధలతో  బరువెక్కిన 
              బండరాయిలా  ఉన్నపుడు
బాధలను  పంచుకుంటూ
              భరోసానిచ్చే  Best Friend నువ్వు
హర్షంతో మహిన  నర్తించే  మైనలా  ఉన్నపుడు
              భవిష్యత్ను  తెలుపుతూ
                         భవిత  బాటను  చూపే 
                                   బాటసారివి  నువ్వు
మంచు ముక్కలా   కరుగుతూ  కూడా
              తన వారికీ  సహాయపడనని  సంతోషించేది  నువ్వు
పువ్వు  వికసిస్తుంది  సూర్యకాంతి వలన
              నా  ఆనందం  చిగురిస్తుంది  నీ  సంతోషం  వలన .
మహిలో  మరపురాని సన్నివేషం ఈ క్షణం
              సంతోషానికి  ప్రతీక ఈ రాఖి బంధం
                        ఈ  అనుబంధానికి నిలువెత్తు  నిదర్శం  మనమిద్దరం .






Comments

Popular posts from this blog

friendship day

Education