Happy Teacher's Day


This poem is all about "How a teacher inspires us ,how they makes us to multi-talented person by their wonderful words and How they feel while making us as a good citizens .” I hope that after reading to this poem you all get to memorize your sweetest moments which were happened with your teachers.Thank You.

Happy Teacher's Day 

                                                  Talari Dhanunjaya

పువ్వు  వికసిస్తుంది  చెట్టు వలన
         కానీ పరిమళం  వ్యాపిస్తుంది  చిరుగాలి వలన
వర్షం  చినుకులు  ఎదిగే  మొక్కకు  అవసరం
Image source:india.com

         గురువు  హితోక్తులు  మనకెంతో  ఉపయెగం .
మల్లెమొగ్గలను  కూర్చడం వలన
         అందమైన  మాలా తయారవుతుంది . 

గురువుల  హితోక్తులనే  ముత్యాలను  గ్రహించడం  వలన
         మహోన్నత  వ్యక్తిత్వం  రూపొందుతుంది .
మట్టిలోని మణులు మనమైతే
         వారి అమోఘమైన  మేధస్సుతో  మనకొక  వెలుగును
               అందించి  ఆ వెలుగును  వీక్షిస్తూ ఆనందించేవారు  గురువులు.
మంచులో ఉన్న పాపాయికి
          అరుణోదయ కాంతిలా  దిశమార్గంను  చూపించేవారు  గురువులు.
పోరాడితే  గెలిచేది నువ్వేలే
          రేపన్నది  నిలిచేది  నువ్వేలే
అంటూ  స్పూర్తితో  మనల్ని
          ముందుకు నడిపించేవాడు  గురువులు.
ఎగరలేని  పక్షికి  విజ్ఙనం, వివేకం  అనే
          రెండు  రెక్కలను  అందించి
                 ఆకాశంలో  ఎగరవేసేవారు  గురువులు .
క్రొవ్వొత్తిలా  కరుగుతూ
          దేశానికి  వెలుగునిచ్చే వారిని  అందిస్తున్నామని
                   ఆనందించేవారు  గురువులు
ప్రతిక్షణం  మనకోసం
          అనుక్షణం  మన ఎదుగుదలకోసం  కృషిచేస్తున్న
                గురువులందరికి  ఈ కవిత  అంకితం .


Comments

Post a Comment

Popular posts from this blog

friendship day

ఆవేదన

Happy Raksha Bandhan