చిన్నారి పెళ్ళికూతురు
Every one need to know about this.
చిన్నారి పెళ్ళికూతురు
-- తలారి ధనుంజయ

చిరుమేఘాలను వ్యాపింపచేసే చిరుగాలి
అమాయకత్వానికి ప్రతిరూపం ఆమె ముఖం
అపురూపమైన ప్రేమకు నిదర్శనం
మహిని ఆనందం వైపు నడిపించే మల్లెమొగ్గను
సూది , దారల మధ్య వేసి మాలగా మార్చే యత్నాలెందుకు?
వికసించిన పువ్వులు , మన ఇంటి నవ్వులు
వెలిగించిన దివ్వెలను , విక్రార్తుల చేతుల్లోకి పంపించేదెందుకు?
పాలుతాగే వయస్సునుండి బయటపడిన చిన్నారి
భవిత వైపు అడుగులు వేసే బంగారుతల్లిని పల్లకి ఎక్కించేదేందుకు?
చెట్టును వీడిన పువ్వుకు దేవుని పాదం నిలయం

ఆకాశపు అంచులను తాకుతు
ఆనందలోకంలో విహరించే పక్షిని
పంజరంలో బందిస్తున్నారెందుకు?

ప్రమిదనుండి బయటపడిన ఒత్తిలా,
తల్లిదండ్రులను వీడిన చిన్నారి
విక్రార్తుల చేతుల్లో విలవిలలాడేను చూడు.
ప్రకాశించే భానుడి పలుకులతో సాగిన ప్రయాణం
నిశాసతి ఒడిలో దాక విశ్రమించని పున్నారిని చూడు.
మదమెక్కినవాడు
మద్యానికి బానిస అయిన భర్త
కాళ్ళలో నలిగినలిగిపోతుంది చూడు.
పచ్చని పైరుపంట గట్ల మధ్య
బంగారు పట్టీలతో పరుగులు తీసిన బంగారుతల్లి,
నేడు భగ్గున మండే ఎండలో ప్రాణాలను త్యాగించి
పనులన్నీ చేస్తూ ఆప్యాయతను కోరుతూ
అమ్మ అని పీలుస్తుంది విను.
భీభత్సమైన వర్షంలో
సాగుతున్న హరిణిలా,
ఉరుము, మెరుపు ఘర్షణలను విని
ధైర్యాన్ని కోరుకుంటూ నాన్న అని అరుస్తుంది విను .

అనుక్షణం అత్త సృష్టించే సుడిగుండాలలో
చిక్కుకొని బోరున రోదిస్తుంది చూడు.
బతుకంటే విరక్తిలేచి,
బాధలెన్నో అనుభవిస్తూ,
తనవారిని తలుచుకుంటూ,
తనువు త్యదించి దూలానికి వేలాడే చిన్నారిని చూసైనా కళ్ళుతెరు.
నిజం తెలుసుకో
బాల్యవివాహాలు ఆపిన తల్లిదండ్రులై
పిల్లల మనసు గెలుచుకో.
Chala Bagundi handsup
ReplyDeletesuper bro
ReplyDeleteit's really superb.keep rocking
ReplyDeleteSUPERB
ReplyDeleteIt's really heart touching.
ReplyDeleteThere will be a great future for you Dhanunjay .
ReplyDeletesuper bro
ReplyDeleteNice Bro.
ReplyDeletewonderful poetry.Thank you,this make me really good.build your poetry, keep on creating more,
ReplyDeletefollow your passion.your ability and your passion will make you successful.
Congratulations
great...this can definitely bring a change in people.a heart touching poetry.
ReplyDeleteExcellent bro
ReplyDeleteno words again
ReplyDelete