Education

This is all about our education. It is mainly focused on importance of our education, How it is helpful to us and what we need to do as educated people.
To know real value of education watch this video.


                                చదువు

రాయిలో  దాగిన  శిల్పానివి నీవైతే
            నీకొక  రూపం అందించే  ఉలియే  చదువు
పగలు ప్రత్యేకతలేని 
            మినుగుడు  పురుగు నీవైతే
నీకొక   ప్రత్యేకతను
            అందించే  చీకటియే నీ చదువు
అమావాస్యనాటి  కమలం నీవైతే
            నీ  నవ్వుల వెలుగులను  వ్యాపింపజేసే  వెన్నెలే   నీ చదువు.
కమ్ముకొని  ఉన్న మంచులో నిలబడ్డ పాపాయివి  నీవైతే
            అరుణోదయ  కాంతితో  నిన్ను ముందుకు  నడిపించేది  నీ చదువు.
పువ్వును  అందంగా  మార్చేది  పరిమళం ,
            జలపాతాన్ని  అద్భుతంగా  ఆవిష్కరించేది  ప్రవాహం ,
                    నిన్ను విజ్ఞాన  వెలుగుల్లో విహరింపచేసేదే  నీ చదువు.
సువాసనలేని  పువ్వు,
            రంగులులేని  ముత్యాల ముగ్గు ,
చుక్కలులేని  ఆకాశం ,
            చదువులేని  జీవితం  వ్యర్థము .
చదువే నిన్ను పున్నమి  చంద్రునిలా  మార్చేది
చదువే నిన్ను దీపధూపాలకు మించిన సంతోషాలకు సుస్వాగతగీతం
చదువే నిన్ను ఊహించని  మలుపులతో నీ  గమ్యాన్ని చేర్చే  విజయగీతం
చదువే నీ  మరణాంతరం  నీతో  జీవించే ఆత్మీయబంధం .
చదువే నిన్ను తళతళమెరిసే  తారల  మధ్య చంద్రునిలా మార్చేది
ఆ చంద్రులందరు  భావిభారత  మనుమనోహరమైన
        కలువల  వికాసానికి తోడ్పడాలని 
భరతమాత  ముద్దు బిడ్డలు ,
       చల్లని  చదువుల  తల్లిఒడిలో  లాలించబడాలని
             ప్రయత్నిస్తున్న  ప్రతి వీరుడికి ఈ  కవిత అంకితం .

                                                             --తలారి ధనుంజయ




Comments

Post a Comment

Popular posts from this blog

friendship day