" పితృదినోత్సవ శుభాకాంక్షలు "
-TALARI DHANUNJAYA
బుడి బుడి అడుగులను నేర్పింది నువ్వు
ఆ అడుగులను చూసి వికసించింది నీ హృదయమనే పువ్వు
నీ ప్రేమ అనే సువాసనతో
తుమ్మెదలాంటి మమ్మల్ని నీ ప్రేమసంద్రంలోకి ఆహ్వానం పలికింది నువ్వు
ఉరుముల ఉరిమినా , మెరుపులా మెరిసిన
వర్షంలా వర్షిచేవాడు నాన్న
అలుపులేకుండా పరుగులు తీసి అలసిన మాకు
హక్కున చేర్చుకునే సంద్రం నాన్న
గుండెలపై లాలించేవాడు నాన్న
మా ప్రతి కోరిక తిర్చే కల్పవృక్షం నాన్న
ప్రొద్దుతిరుగుడు పువ్వులా ముద్దుగా ముద్దుగా
ఉండాలని అల్లారుముద్దుగా పెంచేవాడు నాన్న
నీలి ఆకాశం మిలమిలమనే
ముత్యాలను గల నల్లని వస్త్రం ధరించిన వేలా
చిన్న చిన్న కథలతో
సమున్నత సందేశాన్ని అందించేవాడు నాన్న
తనంటే తానంటూ మిలమిల మెరుస్తున్న చుక్కలను చూపి
సమాజం తీరును భోధించేవాడు నాన్న
చల్లని చంద్రునిలా సమాజంలో
జీవించమని చెప్పేవాడు నాన్న
ఎన్ని ఆటంకాలు ఎదురైనా
నిరంతరం ఆకృతులు మారిన
అమావాస్యకు ఆహుతు అయిన
కమనీయ కలువాలనే పిల్లలకోసం
పున్నేమి చంద్రునిలా వెన్నెలను కురిపించి
వారి చురునవ్వులకు కారణమైన నాన్నలందరికి
"పితృదినోత్సవ శుభాకాంక్షలు "
నాన్న అనే రెండు అక్షరాలు చాలు
చల్లని గాలిలో పసిపాపాయి నవ్వులా మమ్మల్ని మార్చడానికి
నాన్న అనే రెండు అక్షరాలు చాలు
వానవిల్లులోని రంగులన్నింటికీ ప్రతీకగా చూపించడానికి
నాన్న అనే రెండు అక్షరాలు చాలు
మనల్ని రంగుల ప్రపంచంలోకి నడిపించడానికి
నా రంగుల ప్రపంచంలో
ప్రతిరంగు నువ్వే నాన్న
I LOVE YOU నాన్న
nice bro keep writing
ReplyDeleteSuperb
ReplyDeletesuper
ReplyDeleteReally awesome poems....all the best
ReplyDeletenice brother! hope you have a better future
ReplyDeletenice one
ReplyDeletesuper cali fragilistic expialidocious
ReplyDelete