Go confidently Live the life how you have imagined
After reading last poem many of people suggested me to write poem to motivate them ,So, I came with this poem.It is not only motivate them but also everyone . From this poem I would like to tell one thing that " When you get problems , don't go away from those problems , just face it then only you will become stronger otherwise you become weaker. So face problems and become stronger , Go confidently Live the life how you have imagined."
పోరాడితే గెలిచేది నువ్వేలే
రేపన్నది నిలిచేది నువ్వులే
కష్టాలన్నవి ఎన్ని వచ్చిన
కలతచెందకు నువ్వింకా
కల్మషాపు ప్రపంచానికి నువ్వెంటో చుపింక .
కష్టాలు , కన్నీళ్లు గల కారుచీకట్లను గాంచి
చెలించకు చెదిరిపోకుయు నువ్వింకా
నిను పున్నేమి వెన్నెలలో పులకింపజేసే
తోలి ప్రక్రియే అదని తెలుసుకో మా అక్క .
కన్నీటి సాగరంలో మునిగితేలే ఓ చిన్న మొగ్గ
కాపాడేవారికోసం కలవరించడం అపుఇంకా
మునిగితేలితేనే పువ్వుగా వికసించుటవని తెలుసుకో మా అక్క .
పోరాడితే గెలిచేది నువ్వేలే
రేపన్నది నిలిచేది నువ్వులే
కష్టాలన్నవి ఎన్ని వచ్చిన
కలతచెందకు నువ్వింకా
కల్మషాపు ప్రపంచానికి నువ్వెంటో చుపింక .
బాధలనే పొగమంచు కమ్ముకున్న వేళా
అటు ఇటు తెలియక ,
బాట కనిపించక ,
భరోసా నిచ్చేవారికోసం ఎదురుచూడడం ఆపింకా
భగ్గున మండే సూర్యునిలా ఉదయించాలోయి నువ్వింకా
బంగారు భవిత వైపు బాటలు వేసుకోవాలోయి మా అక్క .
కాలుకదపలేని సంకెళ్ళలో చిక్కుకున్న ఓ చిన్ని పావురమా
కాంక్షలను నశింపజేసికుంటూ కనుమరుగైపోకుమా
వీక్షించే ప్రతి కన్ను విమర్షించిన కూడా
అభినందించిన ప్రతి నాలుక ఆక్రోశించిన కూడా
ఆత్మధైర్యంమనే ఆయుధంతో ముందుకు సాగు నువ్వింకా
నువ్వు కన్న కలలను విశ్వపూకనుపాపకు చూపాలోయి మా అక్క .
పోరాడితే గెలిచేది నువ్వేలే
రేపన్నది నిలిచేది నువ్వులే
కష్టాలన్నవి ఎన్ని వచ్చిన
కలతచెందకు నువ్వింకా
కల్మషాపు ప్రపంచానికి నువ్వెంటో చుపింక .
కారుమేఘలు కమ్ముకున్నంత మాత్రాన
సూర్యకిరణాలను ఆపలేవని తెలుసుకో నువ్వింకా
ఆకులు రాలినంత మాత్రాన
చెట్టు చిగురించక మానదు
ఆనకట్టలు కట్టినంత మాత్రాన
నీరు ప్రవహించక మానదు
కష్టాలు వచ్చినంత మాత్రాన
ముందుకు సాగడం మానకు
మనోధైర్యంతో సాగుతూ ఆ హరివిల్లులోని రంగులన్నింటిని
నీ జీవితమనే ముగ్గుకు దిద్దుకోవాలోయి మా అక్క .
పోరాడితే గెలిచేది నువ్వేలే
రేపన్నది నిలిచేది నువ్వులే
కష్టాలన్నవి ఎన్ని వచ్చిన
కలతచెందకు నువ్వింకా
కల్మషాపు ప్రపంచానికి నువ్వెంటో చుపింక . ---తలారి ధనుంజయ
HI Dhanunjaya garu.its my pleasure to read your poems.i like your creativity.and the topics you have got selected. i like very much.and i wish u all the very best create more and more topics
ReplyDeleteand motivate people by your words through poems. THANK YOU
Simply superb... Such an awesome poem connects to everyone
ReplyDelete